Thursday, 27 July 2023

మార్కెట్లలో ఫుల్ జోష్.. ఒక్క దెబ్బకే 20 శాతం పెరిగిన షేరు.. పండగే పండగ 27/07/2023

 Stock Market: మార్కెట్లలో ఫుల్ జోష్.. ఒక్క దెబ్బకే 20 శాతం పెరిగిన షేరు.. పండగే పండగ!
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ మంచి జోష్‌లో ఉన్నాయి. ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల వెల్లువతో సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఈ వార్త రాసే సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 400 పాయింట్లకుపైగా పెరిగి ప్రస్తుతం 66 వేల 700 మార్కు ఎగువన కొనసాగుతుండగా.. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 100 పాయింట్ల లాభంతో 19 వేల 800 మార్కు వద్ద కదలాడుతోంది. లార్సెన్, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్ రాణిస్తుండగా.. ఇదే సమయంలో ఎం అండ్ ఎం, సిప్లా, టైటాన్ కంపెనీ, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, అపోలో హాస్పిటల్స్ డీలాపడ్డాయి.
అమెజాన్‌లో వాటర్ ప్యూరిఫైయర్‌లపై 40% వరకు తగ్గింపు | ఇకపై నీటిని వృధా చెయ్యద్దు
ఇదే క్రమంలో మహిళల కోసం ప్రత్యేకంగా అల్లిన వస్త్రాలు, లోదుస్తులు సహా ఇతర గార్మెంట్ ప్రొడక్ట్స్ తయారీలో నిమగ్నమైన లవేబుల్ లింజరీ లిమిటెడ్ స్టాక్ దూసుకెళ్తోంది. 1987లో ఈ కంపెనీని స్థాపించారు. ఇవాళ ఈ స్టాక్ సెషన్ ఆరంభంలోనే ఏకంగా 20 శాతం పుంజుకొని.. రూ. 150.40 వద్ద స్థిరపడింది. ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.222.59 కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ట విలువ రూ. 180.95 కాగా.. కనిష్ట విలువ రూ.84.10గా ఉంది.
x

What is the zero to hero expiry strategy Fin nifty

What is the zero to hero expiry strategy Fin nifty What is the zero to hero expiry strategy? Is there any zero loss option strategy? What i...